![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -432 లో... ఇంకా రెడీ అవ్వలేదని అపర్ణ తన అత్తమామల దగ్గరికి వస్తుంది. దేనికి అని ఇందిరాదేవి కోపంగా సమాధానం చెప్తుంది. ఈ పెళ్లి మీ చేతుల మీదుగా జరిపించాలని అపర్ణ అనగానే.. అంటే కన్యదానం చెయ్యడమా.. కన్యాదానం చెయ్యడానికి అక్కడ కన్య కాదు వరుడు వైపు ఉందామంటే అక్కడ వరుడు కాదు బాబు తండ్రి అని ఇందిరాదేవి కోపంగా అంటుంది. మావయ్య నేను చేసేది తప్పని మీరు కూడా అనుకుంటున్నారా అని అపర్ణ అడుగుతుంది. తప్పొప్పులు నీకు చెప్పేటంతటి వాళ్ళం కాదని సీతారామయ్య అంటాడు.
ఆ తర్వాత పెళ్లికి అన్ని ఏర్పాట్లు జరుగుతాయి. మాయ పీటలపై కూర్చొని పూజ చేస్తుంది. అందరికి ధాన్యలక్ష్మి అక్షింతలు ఇస్తుంది. అందరు మాయకి అక్షింతలు వేసి ఆశీర్వదించండని పంతులు గారు చెప్తారు. రాహుల్, రుద్రాణి తప్ప ఎవరు అక్షింతలు వెయ్యరు. ఆ తర్వాత ధాన్యలక్ష్మి, ప్రకాష్ లు వేస్తారు. ఇది ఎవరికి తప్పు అనిపించిన కూడా ఒక బాబుకి న్యాయం జరగాలని నేను ఈ నిర్ణయం తీసుకున్నానని అపర్ణ అంటుంది. అక్షింతలు వెయ్ పోవే కొన్ని నిమిషాల్లో నీ భర్త వేరొకరి సొంతం కాబోతున్నాడని కావ్యపై స్వప్న విరుచుకుపడుతుంది. ఆ తర్వాత మాయని అపర్ణ అక్షింతలు వేసి ఆశీర్వదిస్తుంది. ఇక నుండి మిమ్మల్ని అత్తయ్య అని పిలవచ్చా అని మాయ అనగానే.. కోపంగా సరేనంటుంది అపర్ణ. నీ బిడ్డకే కాదు నీక్కూడా మా వదిన న్యాయం చేస్తుందని మాయతో రుద్రాణి అంటుంది. కావ్య బయటకు వచ్చి బాధపడుతుంటే.. ఇంకా టైమ్ అవ్వలేదు.. నువ్వు అక్కడికి వచ్చి నాకు మీ పెళ్లి ఇష్టం లేదని చెప్పమని కావ్యకి ఇందిరాదేవి చెప్తుంది. కావ్య అందుకు ఒప్పుకోదు.
మరొకవైపు అసలు మాయ స్పృహలోకి వస్తుందని అప్పు వెయిట్ చేస్తుంది. కావ్యకి కాల్ చేసి మాయ స్పృహలోకి వచ్చిందని అప్పు చెప్తుంది. మీరంతా కొద్దిసేపు పెళ్లి ఆపండి.. ఏం చేసి అయిన సరే పెళ్లి ఆపించేస్తానని కావ్య వెళ్ళిపోతుంది. ఆ తర్వాత రాజ్ పీటలపై కూర్చొని ఉంటాడు. మాయ దగ్గరికి కావ్య వెళ్లి మాట్లాడించే ప్రయత్నం చేస్తుంటే.. తను మళ్ళీ స్పృహ కోల్పోతుంది. తరువాయి భాగంలో మాయ కోమాలోకి వెళ్ళిందని డాక్టర్ చెప్పగానే.. కావ్య షాక్ అవుతుంది. ఆ తర్వాత కావ్య బాధగా ఇంటికి వెళ్తుంది. ఏమైందని రాజ్ అడుగుతాడు. తనకి చేతులు జోడించి సారీ అడుగుతుంది కావ్య. ఆ తర్వాత రాజ్ తాళి కట్టబోతుంటే ఆగమని సుభాష్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |